‘కేజీఎఫ్’ రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్’ సినిమా శాండల్‌వుడ్‌లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో యష్ సతీమణి రాధిక పండిట్ నాయికగా నటించింది. మహేష్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగులో ‘రారాజు’ పేరుతో ఈ నెల 14న విడుదల చేస్తున్నది.
ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్మీట్లో నిర్మాత వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ…‘రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. హీరో యష్ ఆయన సతీమణి కలిసి నటించారు. కన్నడలో మంచి విజయం సాధించింది. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ క్రేజ్ టాలీవుడ్‌లోనూ పెరిగింది. ఈ నెల14న ఈ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు.