Upendra | ఉపేంద్ర సరికొత్త ప్రయోగం.. 20న ప్రేక్షకుల ముందుకు యూఐ
వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర. ఆయన పోషించే పాత్రలు కూడా విలక్షణంగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘యూఐ’పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.
Upendra | వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర. ఆయన పోషించే పాత్రలు కూడా విలక్షణంగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘యూఐ’పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. లహరి ఫిల్మ్స్ పతాకంపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని మేకర్స్ తెలిపారు. సమకాలీన సమాజంలోని సంఘటనలతో పాటు భవిష్యత్తు భారతంలోని సమస్యలను కథాంశంగా తీసుకొని తనదైన శైలిలో ఉపేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారని, కొంతభాగం కథ 2040లో నడుస్తుందని, విజువల్స్ అబ్బురపరుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య తదితరులు ఈ చిత్రలో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

