Shivarajkumar | ఈ సినిమా వేరే లెవల్లో ఉంటుంది.. ‘ఆర్సీ 16’పై శివ రాజ్‌కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్సీ 16. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నాడు.
RC 16 Movie | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్సీ 16. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. తాజాగా మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బుచ్చిబాబు మంచి విజన్ ఉన్న దర్శకుడని.. తాను కథ చేప్పేందుకు నా దగ్గరకు వచ్చినప్పుడు అతడికి అరగంట సమయం ఇచ్చానని.. అయితే బుచ్చిబాబు కథ చెప్పడం మొదలు పెట్టి అది పూర్తయ్యేవరకు గంట అయ్యిందని తెలిపారు. కథ వింటున్నప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేస్తున్నానని మనసులో అనుకున్న.. ఈ సినిమాలో పాత్రలను బుచ్చిబాబు చక్కగా రాశారని.. ఇది పూర్తిగా వేరే స్థాయిలో ఉంది. అతడు ఆ క్యారెక్టర్ ఎలా ఇమాజిన్ చేసుకున్నాడో అని ఆశ్చర్యం కలిగింది అంటూ శివన్న చెప్పుకోచ్చాడు.
ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

