సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా తనువు చాలిస్తూ ఉన్నారు. కరోనా మొదలైనప్పటి నుండి చాలా మంది ప్రముఖులు తనువు చాలించారు. తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్తో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూనే సత్యజిత్ కన్నుమూసినట్టు తెలుస్తుంది.
సత్యజిత్ కన్నడంలో ఆరు వందలపైగా సినిమాలలో నటించారు. ఆయన అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. 10వ తరగతి వరకు చదివిన ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టారు. విలన్ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. సత్యజిత్ హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.