బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది అగ్ర కథానాయిక కంగనా రనౌత్. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన మనసులోని భావాల్ని వ్యక్తం చేయడం ఈ భామ నైజం. దాంతో ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తుంటుంది. తాజాగా ఆమె వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో కంగనారనౌత్ మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు ధరించి వివాహితలా కనిపిస్తున్నది. దీంతో ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా వీటిపై ఆమె క్లారిటీనిచ్చింది.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘నేను షూటింగ్లో క్యారెక్టర్ మేకప్‌తో ఉండగా ఎవరో ఈ ఫొటో తీశారు. గత కొన్ని రోజులుగా నా పెళ్లి గురించి ఆరాతీస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నటులు అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. గెటప్‌ని చూసి పెళ్లయిపోయిందని అనుకుంటున్నారు. నేను మీ అందరికి ప్రామిస్ చేస్తున్నా. ఎట్టిపరిస్థితుల్లో రహస్యంగా పెళ్లి చేసుకోను. మీ అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటా’ అని కంగనా రనౌత్ తన పోస్ట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ భామ ‘క్వీన్-2’ షూటింగ్లో ఉంది. ఈ సినిమాలోని పాత్రకోసమే వివాహిత గెటప్‌లో కనిపించిందని సమాచారం.