Kangana Ranaut: పెళ్లిపై స్పందించిన కంగనా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ కామెంట్

స్టార్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రేమాయణంపై ఓపెన్ అయింది. తన ప్రియుడిని పరిచయం చేస్తూ తెగ సంతోషించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బాంబ్ కంగనా రనౌత్ టైం వచ్చింది. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రాబోయే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు అని ప్రశ్నలు సంధించగా,దానికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది కంగనా.
రాబోయే ఐదేళ్లలో తల్లిగా నన్ను నేను చూడాలని అనుకుంటున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. అని కంగన బదులిచ్చింది. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా? అంటే అవునని ఆమె తెలిపారు. అంతే కాదు.. ఆ వ్యక్తి గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుందని కంగనా చెప్పడం విశేషం. రీసెంట్‌గానే కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. కంగనా తన పదిహేను ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసింది. ఆణిముత్యాల్లాంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించింది.
ఉక్కు మహిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుని కథను రూపొందించే పనిలో కంగన అండ్ టీమ్ వర్క్ చేస్తుంది. కాగా, రీసెంట్గా కంగనా రనౌత్ తలైవి చిత్రంతో పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

