Kangana Ranaut | సీతావతార దర్శనం

భారతీయ చలన చిత్రసీమలో అద్భుత అభినయ ప్రతిభాసంపత్తితో అగ్రతారగా వెలిగిపోతున్నది కంగనారనౌత్. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డుల గ్రహీతగా ఆమె తారాపథంలో తిరుగులేని కీర్తిని సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ‘తలైవి’ చిత్రంలో కంగనారనౌత్ మరోమారు తన విశ్వరూపాన్ని చూపించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. వెండితెరపై ఇదే విజయాల జోరును కొనసాగిస్తూ కంగనారనౌత్ మరో భారీ పాన్ఇండియా చిత్రానికి సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు సాంఘిక, చారిత్రక చిత్రాల్లో మెప్పించిన ఆమె తొలిసారి పౌరాణిక నాయిక, మహాసాధ్వి సీత పాత్రను పోషించబోతున్నది. ‘ది ఇన్కార్నేషన్-సీత’ పేరుతో అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సలోనిశర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ రచనలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ‘భారతీయ సాంస్కృతిక జీవనంలో ముఖ్యపాత్రధారియైన సీతను ఇదివరకెప్పుడూ దర్శించని రీతిలో ఆవిష్కరించబోతున్నాం. రామాయణ ఇతిహాసాన్ని మరో పార్శంలో తరచి చూపించే చిత్రమిది. మహిళా శక్తికి ప్రతీకలా అనిపించే కంగనారనౌత్ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. రాబోవు కొద్దిమాసాల్లో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకురానున్నారు. కంగనారనౌత్ బాలీవుడ్లో తేజాస్, ధాకడ్ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kangana ranaut
- seetha
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

