Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆమె సినిమా, రాజకీయ వ్యాఖ్యలు లేదా వివాదాల కారణంగా కాదు. ఒక చిన్న వీడియో క్లిప్ కారణంగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గురువారం సాయంత్రం నుంచి కంగనాకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుండగా, అది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కంగనా తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి ఒక ప్రాంతం నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఆమె ఎప్పటిలాగే సింపుల్‌గా, హుందాగా కనిపించినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం ఆమె మెడలో కనిపించిన నల్లపూసల గొలుసు, అంటే మంగళసూత్రం.
సాధారణంగా హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే ఈ మంగళసూత్రం కంగనా మెడలో కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.కంగనా ఇప్పటివరకు తన పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా గతంలో కూడా ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళసూత్రంతో కనిపించడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీసింది. వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో కామెంట్ల వరద మొదలైంది. “కంగనా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందా?”, “సీక్రెట్ వెడ్డింగ్ జరిగిపోయిందా?”, “మెడలో ఉన్న మంగళసూత్రం వెనుక అసలు కారణం ఏమిటి?” అంటూ నెటిజన్లు వరుస ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ఏదైనా సినిమా షూటింగ్ కోసం లేదా ఫోటోషూట్‌లో భాగంగా ధరించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడం కొత్త విషయం కాదు. చాలామంది నటీనటులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా వివాహంకి సంబంధించిన వార్తలతో అభిమానులకు షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కంగనా విషయంలో కూడా అలాంటిదే జరిగి ఉంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ వార్తలపై కంగనా రనౌత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అందువల్ల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాగానాలుగానే భావించాలి. ఆమె మెడలో కనిపించిన మంగళసూత్రం నిజంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా, లేక ఏదైనా సినిమా లేదా ఇతర కారణమా అన్న విషయం అధికారిక స్పష్టత వచ్చే వరకు సస్పెన్స్‌గానే మిగిలే అవకాశం ఉంది.