నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. కొత్తగూడెం (ముసలమ్మచెట్టు) గ్రామంలో తన మామ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్‌ను ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యామిలీతో కలిసి శనివారం ప్రారంభించారు. భవిష్యత్‌లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమలు చేపడతామని తెలిపారు.
ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పెద్దవూర మండల కేంద్రం నుండి సుమారు 5కిలోమీటర్లు బైక్ ర్యాలీ తీశారు. కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి 10వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురవయ్య యాదవ్ పాల్గొన్నారు.