Vikram Review | కమల్‌హాసన్ ‘విక్రమ్’ రివ్యూ
నటీనటులు: కమల్‌హాసన్, విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, కళిదాస్ జైరామ్, అర్జున్ దాస్.
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్.
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్.
నిర్మాత: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్.
తెలుగు విడుదల: శ్రేష్ఠ్ మూవీస్.
విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినిమాల్ని వైవిధ్యానికి చిరునామాగా అభివర్ణిస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తుంటారాయన. వాణిజ్య కథల్లో కూడా కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తారు. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న ఆయన తాజాగా యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’తో ప్రేక్షకులముందుకొచ్చారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో తమిళనాట టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లొకేష్ కనకరాజ్ ఈ సినిమాకు నిర్ధేశక బాధ్యతల్ని నిర్వర్తించారు. దాంతో ‘విక్రమ్’పై అంచనాలు పెరిగాయి. స్వతహాగా కమల్‌హాసన్ వీరాభిమాని అయిన లొకేష్ కనకరాజ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య (అతిథి పాత్ర) వంటి భారీ తారాగణం కలబోసిన సినిమా కావడంతో ‘విక్రమ్’ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. మరి ఈ చిత్రం కమల్‌హాసన్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందా? దర్శకుడు లొకేష్ కనకరాజ్ మరోసారి తెరపై మేజిక్ చేయడంలో సక్సెస్ అయ్యారా? ఈ విషయాలన్నీ సమీక్షలో చూద్దాం..
కథ గురించి:
డ్రగ్స్ లోడ్‌తో ఉన్న రెండు భారీ కంటెయినర్స్ చెన్నై నగరంలో మిస్ అవుతాయి. వాటిని తిరిగి చేజిక్కించుకోవడానికి లోకల్ డాన్లు ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు ముసుగులు ధరించిన ఓ ముఠా నగరంలో వరుస హత్యలకు పాల్పడుతుంటుంది. అందులో ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా ఉంటారు. నార్కొటిక్స్ బ్యూరోలో పనిచేసే ప్రభంజన్ (కాళిదాస్) కూడా ముసుగు ముఠా చేతిలో హత్యకు గురవుతాడు. ఈ కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ కవర్ కాప్ అమర్‌కు (ఫహద్ ఫాజిల్) అప్పగిస్తుంది. మరోవైపు తన కుమారుడు ప్రభంజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరుతాడు కర్ణన్ (కమల్‌హాసన్). ఈ క్రమంలో భారీ ఆపరేషన్‌కు సిద్ధపడతాడు. అసలు కర్ణన్ ఎవరు? అతని గత చరిత్ర ఏమిటి? నగరంలో పేరు మోసిన డాన్ సంతానంకు (విజయ్ సేతుపతి) డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలేమిటి? అమర్ ఆపరేషన్‌లో తెలుసుకున్న నిజాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
విశ్లేషణ:
డ్రగ్స్ మాఫియా, పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్స్ చుట్టూ అల్లుకున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆరంభ సన్నివేశాల్లోనే ఉత్కంఠను సృష్టించారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. తొలుత డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు చేయడానికి అండర్‌కవర్ పోలీస్ అమర్ (ఫహద్ ఫాజిల్) చేపట్టే ఆపరేషన్‌తో ప్రథమార్థమంతా ఆసక్తికరంగా సాగింది. అమర్ ఇన్వెస్టిగేషన్లో నిజాలు తెలుస్తున్న కొద్దీ కథ తాలూకు చిక్కుముడులు విడిపోతుంటాయి. అనేక లేయర్స్‌తో కూడిన ఈ కథను ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకుడు లొకేష్ కనకరాజ్ సఫలీకృతుడయ్యారు. ద్వితీయార్థంలో కథాగమనం వేగంగా సాగింది. కర్ణన్ ఐడెంటిటీ రెవీల్ కావడం..అతను చేపట్టిన ఆపరేషన్ ఏమిటో తెలిసిపోవడంతో కథలో ఉత్కంఠకు తెరపడినప్పటికీ…డ్రగ్స్ మాఫియాను అంతమొందించడానికి కర్ణన్ పన్నే వ్యూహాలు ఆసక్తిని పంచుతాయి.
సాధారణంగా ‘రా’ ఏజెంట్స్ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాల్ని ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో నడిపిస్తూ అంతర్లీనంగా దేశభక్తిని తెలియజెప్పే ప్రయత్నం జరుగుతుంది. ‘విక్రమ్’ సినిమాలో అలాంటి అంశాల్ని టచ్ చేయలేదు. చిన్నారి మనవడి కోసం ఎంతగానో తపించే వ్యక్తిగా కర్ణన్ పాత్రను భావోద్వేగభరితంగా నడిపించడం ఆకట్టుకుంటుంది. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కాబట్టి హింసాత్మక దృశ్యాల మోతాదు ఎక్కువగానే ఉంది. ైక్లెమాక్స్ ఘట్టాల్ని రొమాంచితమైన యాక్షన్ ఎపిపోడ్స్‌తో తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అయితే ప్రథమార్థంలో కమల్‌హాసన్ పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండటం నిరుత్సాహపరుస్తుంది. దాదాపు మూడు గంటలు నిడివితో సినిమాను తీశారు. కొన్ని సందర్భాల్లో కథాగమనం ఏమిటో అర్థంకాని అయోమయానికి గురవుతారు ప్రేక్షకులు. సినిమా నిడివి కాస్త తగ్గిస్తే బాగుండేది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
కమల్‌హాసన్ అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణన్ పాత్రలో జీవించారు. కొడుకు మరణంతో సంఘర్షణకులోనయ్యే తండ్రిగా, ఏజెంట్ విక్రమ్‌గా తనదైన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడు సంతానంగా విజయ్ సేతుపతి క్రూరమై విలనీ పండించాడు. ఆయన కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్రగా మిగిలిపోతుంది. సినిమా ఫస్ట్హాప్ను మొత్తం తనదైన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో నడిపించాడు ఫహద్ ఫాజిల్. సినిమా మొత్తంలో ఆయనకే ఎక్కువ స్క్రీన్‌స్పేస్ దక్కిందని చెప్పొచ్చు. మాఫియా డాన్స్ రొలేక్స్ పాత్రలో పతాకఘట్టాల్లో మెప్పించారు సూర్య.
ఇక సాంకేతికంగా ప్రతి విభాగం ఉన్నతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను మంచి నాణ్యతతో తెరకెక్కించారు. సినిమా కాన్సెప్ట్‌కు అనుగుణంగా కెమెరామెన్ గిరీష్ గంగాధరన్ కలర్ టింట్ మెయిన్‌టెయిన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
యాక్షన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకుల్ని ‘విక్రమ్’ ఆకట్టుకునే అవకాశం ఉంది. కమల్‌హాసన్‌కు కమ్‌బ్యాక్ మూవీగా చెప్పొచ్చు. బాక్సాపీస్ ఫలితం ఏమిటో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచిచూడాల్సిందే..
రేటింగ్: 2.5/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

