Bimbisara Movie | కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్‌రామ్.. ‘బింబిసారా’ ఫస్ట్‌డే కలెక్షన్స్
Bimbisara Movie Collections | ఏడెళ్ళ కిందట వచ్చిన ‘పటాస్’ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. కమర్షియల్‌గా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ మార్కెట్‌ను పెంచింది. ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో మరో హిట్ పడలేదు. మధ్యలో ‘118’ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. దాంతో కళ్యాణ్‌రామ్ ఏడేళ్ళుగా కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ చిత్రాన్ని తనే స్వయంగా నటించి నిర్మించాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజీటీవ్ రివ్యూలను తెచ్చుకుని ఘన విజయం సాధించింది. మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధిస్తుంది. అంతేకాకుండా కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను రాబట్టిన సినిమాగా బింబిసారా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను ఒకసారి గమనిస్తే:
నైజాం : 2.15 కోట్లు
సీడెడ్ : 1.29 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.90 కోట్లు
ఈస్ట్ : 0.43 కోట్లు
వెస్ట్ : 0.36 కోట్లు
గుంటూరు : 0.57 కోట్లు
కృష్ణా : 0.34 కోట్లు
నెల్లూరు : 0.26 కోట్లు
ఏపి+తెలంగాణ : 6.30 కోట్లు (9.30 కోట్ల గ్రాస్)
టోటల్ వరల్డ్ వైడ్ : 7.30 కోట్లు (11.5 కోట్ల గ్రాస్)
‘బింబిసారా’ చిత్రానికి రూ.16 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.16.5 కోట్ల వరకు షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజే ఈ చిత్రం రూ.7.3 కోట్ల షేర్‌ను సాధించింది. అంటే మరో 9.2 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్‌ను పూర్తవుతుంది. ఇప్పడున్న జోష్‌లో వీకెండ్‌లోపు సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్లో కళ్యాణ్‌రామ్ బింబిసార2 పెద్ద స్కేల్లో ఇంకా బెట్టర్‌గా తెరకెక్కుతుందని తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

