Bimbisara Movie | బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ‘బింబిసార’.. లాభాల్లో కళ్యాణ్‌రామ్
Bimbisara Movie Collections | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం బింబిసార. కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడదలై సంచలన విజయం సాధించింది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. 2015లో వచ్చి న పటాస్ కళ్యాణ్‌రామ్‌కు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఆ తర్వాత మళ్ళి ఏడేళ్ళకు బింబిసారతో ఆ స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు చిత్రాన్ని వీక్షించి మేకర్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఫాంటిసి యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ మల్లడి వశిష్ఠ తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఏరియా వైజ్ కలెక్షన్లను గమనిస్తే..
నైజాం : 5.72 కోట్లు
సీడెడ్ : 3.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.29 కోట్లు
ఈస్ట్ : 1.03కోట్లు
వెస్ట్ : 0.74 కోట్లు
గుంటూరు : 1.27 కోట్లు
కృష్ణా : 0.89 కోట్లు
నెల్లూరు : 0.50 కోట్లు
ఏపి+తెలంగాణ : 15.84 కోట్లు (24.50 కోట్ల గ్రాస్)
టోటల్ వరల్డ్ వైడ్ : 18.29 కోట్లు (30 కోట్ల గ్రాస్)
‘బింబిసారా’ చిత్రానికి రూ.16 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.16.5 కోట్ల వరకు షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇక మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.18.29 కోట్ల షేర్‌ను సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్ ఇది. ఈ చిత్రంతో 30 కోట్ల మార్కును టచ్ చేశాడు. ఇటీవలే దిల్‌రాజు, శిరిష్‌లు ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో కళ్యాణ్‌రామ్, వశిష్ఠ, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు నైజాం డిస్ట్రీబ్యూటర్లకు పార్టీ ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

