కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమిగోస్’. అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘యెక యెక..’ అనే లిరికల్ గీతాన్ని విడుదల చేశారు.
జిబ్రాన్ స్వరపర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా…అనురాగ్ కులకర్ణి పాడారు. ఒకే రూపముండి ఒకరికొకరు పరిచయం లేని ముగ్గురు వ్యక్తులు మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపేలా సాగిందీ పాట. ఈ మూడు పాత్రలను కళ్యాణ్ రామ్ పోషించడం విశేషం. ఈ ముగ్గురు ఒకే పోలికల్లో ఎందుకున్నారు. ఈ పోలికలు వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాయి ఆసక్తికరంగా చెబుతున్నారు చిత్రబృందం.