Kalki 2 | ‘కల్కి’ని మరింత విస్తరించే ఆలోచన.. ఓటీటీలో రెండు వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్!
Kalki 2 | దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ భారతీయ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, ‘కల్కి పార్ట్ 2’పై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం అభిమానులంతా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ మరో ఆసక్తికరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది
Kalki 2 | దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ భారతీయ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, ‘కల్కి పార్ట్ 2’పై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం అభిమానులంతా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ మరో ఆసక్తికరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ను మరింత విస్తరించే దిశగా రెండు ప్రత్యేక వెబ్ సిరీస్‌లను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సిరీస్‌లు ‘కల్కి పార్ట్ 2’ కథకు నేరుగా అనుసంధానమై ఉండనున్నాయని తెలుస్తోంది.
మొదటి వెబ్ సిరీస్ ‘కల్కి 2898 AD’లో క్యామియో పాత్రలో కనిపించిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పాత్రకు సంబంధించిన బ్యాక్స్టోరీపై ఆధారపడి ఉండనుందని సమాచారం. సినిమాలో అతని పాత్రకు వచ్చిన స్పందన నేపథ్యంలో ఆ పాత్ర గతాన్ని మరింత లోతుగా చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక రెండో వెబ్ సిరీస్ కథలో అత్యంత కీలకమైన సుమతి పాత్ర చుట్టూ తిరగనుందట. సీక్వెల్లో ఈ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉండబోతున్న నేపథ్యంలో, సుమతి గతం, ఆమె ప్రయాణాన్ని ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారని సమాచారం. ఇదే సమయంలో సీక్వెల్లో సుమతి పాత్రలో సాయి పల్లవి నటించనున్నారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
దీపికా పదుకొణె పోషించిన పాత్రను భవిష్యత్తు కథలో కొత్త కోణంలో చూపించాలనే ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులు కొత్త పాత్రల పరిణామాన్ని అర్థం చేసుకునేలా, ‘కల్కి పార్ట్ 2’కు బలమైన పునాది వేసే విధంగా ఈ కంటెంట్ రూపొందనుందట. ఈ రెండు వెబ్ సిరీస్‌లు దాదాపు గంట నిడివితో ఉండనున్నాయని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ముఖ్యంగా ఈ సిరీస్‌లు ‘కల్కి 2898 AD’ క్లైమాక్స్‌కు నేరుగా కనెక్ట్ అవుతూ, ‘కల్కి పార్ట్ 2’లోకి ప్రేక్షకులను తీసుకెళ్లే బ్రిడ్జ్‌లా పనిచేయనున్నాయని సమాచారం. దీంతో థియేటర్లలో సీక్వెల్ విడుదలకు ముందే ఓటీటీలో రాబోయే ఈ కంటెంట్ అభిమానులకు మరో పెద్ద సర్ప్రైజ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌లపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amitabh
- Kalki
- kalki2
- kamal hassan
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

