బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకుడు. డా॥ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇటీవల టీజర్‌ను యువ దర్శకుడు సాగర్ చంద్ర ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ “కలశ’ అనే టైటిల్‌ను ఈ సినిమాలోని క్యారెక్టర్ నుంచి తీసకున్నాం. కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ పాత్ర కూడా అంతే పవిత్రంగా కనిపిస్తుంది. బ్రెయిన్‌ని హార్ట్‌కి అనుసంధానిస్తూ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగధారి, సంగీతం: విజయ్ కురాకుల.