పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాస్ తక్కలపల్లి నిర్మాతలు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని ఈనెల 11న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ తన కెరీర్లోనే విభిన్నమైన పాత్రను ఇందులో కాజల్ చేస్తున్నారు. సత్యభామగా కాజల్ కొత్త అవతారాన్ని ప్రేక్షకులు చూస్తారు. దాదాపు షూటింగ్ 60శాతం పూర్తయింది.
ఇటీవలే హైదరాబాద్‌లో కాజల్ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతోపాటు పోరాటాలను కూడా తెరకెక్కించాం. ఈ నెల రెండోవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రానికి ఆయనే స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. చిత్రానికి కెమెరా: జి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల.