Kajal Aggarwal | లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). చందమామ సినిమాతో గ్లామర్ డాళ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది. గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu)ను పెళ్లి చేసుకుని.. కొడుకు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీ అయింది.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే కాజల్.. కాస్త రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. కాజల్-గౌతమ్‌తో కలిసి హాలీడే టూర్ వేసుకుంది. ఈ కపుల్ వైట్ అండ్ వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ క్రేజీ కాంబో డ్రెస్సుల్లో బోటులో షికారు చేస్తూ.. కెమెరాకు ఫోజులిచ్చారు. కాజల్ బోటు షికారులో సముద్ర అందాలు ఆస్వాదిస్తూ.. ఛిల్ అవుట్ అవుతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరు అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతుండగా.. ఇంతకీ ఎక్కడికెళ్లారనేది చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశారు.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తోంది కాజల్. ఈ భామ భగవంత్ కేసరి, ఇండియన్ 2 లాంటి భారీ ప్రాజెక్టుల్లో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తోంది. సత్యభామలో ఏసీపీగా కనిపించనుండగా.. ఈ మూవీతోపాటు హిందీలో నటిస్తున్న ఉమ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
సముద్రంలో షికారు ఇలా..