మహిళా శక్తి గురించి చెబుతుంది
‘భగవంత్ కేసరి’ చిత్రంలో స్త్రీ శక్తి, మహిళా సాధికారత గురించి గొప్పగా ఆవిష్కరించారని, ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కాత్యాయని పాత్రలో ఆమె కనిపించనుంది. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘కాత్యాయని ఒక సైకాలజిస్ట్.

తను చాలా తెలివైన మహిళ. కథాగమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలోని మహిళా శక్తి అనే కాన్సెప్ట్ నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయింది. ఆడపిల్లను ధైర్యంగా పెంచాలనే అంశం గొప్పగా అనిపించింది. ఇలాంటి కథ నేటి సమాజానికి అవసరం అనిపించింది’ అని చెప్పింది. బాలకృష్ణ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారని, షూటింగ్ అంతా హ్యాపీగా సాగిందని కాజల్ అగర్వాల్ తెలిపింది. ‘దర్శకుడు అనిల్రావిపూడిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఆయన తీసిన ‘ఎఫ్-2’ ‘ఎఫ్-3’ సినిమాలు బాగా నచ్చాయి. ‘భగవంత్ కేసరి’లో ఆయన శైలి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ‘సత్యభామ’ సినిమా చేస్తున్నా. ఇక ‘ఇండియన్-2’లో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’ అని కాజల్ అగర్వాల్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?