Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Kaala Bhairava | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు
Kaala Bhairava | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్‌ల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళితో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుక ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక కావ్య కళ్యాణ్‌రామ్ విషయానికి వస్తే.. బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత హీరోయిన్గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘బలగం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ‘మసూద’ వంటి చిత్రాలతోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు కాలభైరవ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన పాటలతో పాటు సంగీతంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇరు కుటుంబాల అంగీకారంతో కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్‌ల వివాహం డిసెంబర్లో జరగనున్నట్లు తెలుస్తోంది. బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెల టాలీవుడ్లో పెళ్లి వేడుకలతో సందడిగా మారనుంది. ఇప్పటికే సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ప్రేయసి కిరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్ 5న జరిగిన ఈ వేడుకతో త్వరలో ఆయన కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్‌ల పెళ్లి కూడా డిసెంబర్లోనే జరగనుండటంతో సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. హీరో తేజ సజ్జా కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

