K Viswanath Songs | మరపురాని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ (K Viswanath). చిరంజీవి, కమల్‌హాసన్, వెంకటేశ్ లాంటి హీరోలకు కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన సినిమాలు అందించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, స్వయంకృషి, ఆపద్భాంధవుడు, స్వర్ణకమలం, శుభసంకల్పం లాంటి ఆల్‌టైమ్ ఫేవరేట్ సూపర్ హిట్ సినిమాలతో కళాతపస్విగా పేరు లిఖించుకున్నారు.
కే విశ్వనాథ్ సినిమాలంటే కథకు ఎంత ప్రాధాన్యముంటుందో.. పాటలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చిరంజీవి నటించిన స్వయంకృషిలో పారాహుషార్, ఆపద్బాంధవుడు చిత్రంలో ఔరా అమ్మకుచల్లాతోపాటు మిగిలిన పాటలన్నీ ఆల్‌టైమ్ హిట్స్ గా నిలిచాయి.
స్వాతిముత్యంలో సువ్విసువ్వి సువ్వాలమ్మా, సాగర సంగమంలో తకిట తదిమి, శుభసంకల్పంలో సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, నీలాల కన్నుల్లో సంద్రమే, స్వర్ణకమలం సినిమాలో ఘల్లు ఘల్లు మంటు సాంగ్‌తోపాటు మిగిలిన పాటలను ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.
ఔరా అమ్మకుచల్లా సాంగ్..
ఘల్లు ఘల్లు మంటు సాంగ్
తకిట తదిమి సాంగ్..
నీలాల కన్నుల్లో సంద్రమే..
సువ్విసువ్వి సువ్వాలమ్మా..
పారాహుషార్ సాంగ్..