హైదరాబాద్: జురాసిక్ వరల్డ్ డొమీనియన్ ఫిల్మ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. కొత్త జురాసిక్ పార్క్ ట్రయాలజీలో ఇదే ఫైనల్ చిత్రం కానున్నది. డైనోసర్లు భూమిపై రాజ్యం ఏలుతున్న రీతిలో ఈ ఫిల్మ్ లో చూపించారు. జురాసిక్ పార్క్ ఫాలెన్ కింగ్డమ్ తర్వాత సీక్వెల్గా డొమీనియన్ వస్తోంది. డైనోసార్లు వికృతి రీతిలో విరుచుకుపడే సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టీ-రెక్స్ లాంటి డైనోలతో పాటు కొత్త తరహా డైనోసార్లను ఈ చిత్రంలో పరిచయం చేస్తున్నారు. స్టీవెన్ స్పిల్బర్గ్ తీసిన తొలి జురాసిక్ పార్క్ చిత్రంలో నటించిన కొందరు నటులు డొమీనియన్లో కూడా నటిస్తున్నారు. తాజా చిత్రాన్ని కొలిన్ ట్రెవర్రో డైరెక్ట్ చేస్తున్నా. జూన్ 10వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.