June 1st week Releases | జూన్ మాసంలోకి అడుగుపెట్టాం. గతనెల బాక్సాఫీస్ దగ్గర భారీగా పేలిన సినిమా ఒక్కటీ లేదు. ఫస్ట్ వీకెండ్ ఊపిన బిచ్చగాడు-2 సినిమా వీక్ డేస్ లో తేలిపోయింది. ఎన్నో విమర్శల మధ్య రిలీజైన ది కేరళ స్టోరీని ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులు మాత్రమే చూడటంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక 2018 రూపంలో కాస్త బాక్సాఫీస్ కు కళ వచ్చిందనుకున్న టైమ్ లో ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేసి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడేలా చేశారు. కాస్తో కూస్తో మే నెలలో మురిపించిన సినిమా ఏదైనా ఉందంటే అది మేము ఫేమస్ సినిమానే. మరీ భీభత్సమైన హిట్ అనలేం కానీ ఉన్నంతలో కాస్త బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. అయితే ఓటీటీ ప్రియులకు మాత్రం గత నెల బాగానే ఎంటర్టైన్ చేసింది. విరూపాక్ష, రావణాసుర, మీటర్ వంటి కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అయ్యాయి. ఇక ప్రతివారం లానే జూన్ తొలివారం కూడా ప్రేక్షకులకు విందు భోజనం పెట్టడానికి పలు సినిమాలు/ వెబ్ సిరీస్ లు సిద్దమవుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..
నేను స్టూడెంట్ సార్:
గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో పోటీగా వచ్చి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఆయన డెబ్యూగా తెరకెక్కిన స్వాతిముత్యం రిలీజ్ రోజున పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ అప్పటికే చిరు గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ సినిమాలు విడుదల కావడంతో ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేరు. ఇక ఇప్పుడు నేను స్టూడెంట్ సార్ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 2న విడుదల కానుంది. అవంతిక హీరోయిన్ గా నటించిన సముద్రఖని కీలకపాత్ర పోషించాడు.
అహింస:
ఈ మధ్య కాలంలో ‘అహింస’ వాయిదా పడినన్ని సార్లు మరే సినిమా వాయిదా పడలేదెమో. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాన్న బడా ప్రొడ్యూసర్, అన్న పాన్ ఇండియా యాక్టర్ అయినా.. కానీ అభిరామ్ సినిమాకు ఆది నుంచి కష్టాలే. ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్ కు జోడీగా గీతికా తివారి హీరోయిన్ గా నటించింది.
పరేషాన్:
ఏడాది కిందట వచ్చిన ‘మసూద’తో హీరోగా డెబ్యూ ఇచ్చాడు నటుడు తిరువీర్. తొలి సినిమానే తిరువీర్ కు తిరుగులేని విజయాన్నిచ్చింది. ప్రస్తుతం అదే జోష్ తో ‘పరేషాన్’ అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి హైపే క్రియేట్ చేసింది.
వీటితో పాటుగా నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పద్మవ్యూహం’,’ ఐక్యూ’ సినిమాలు జూన్ 2న విడుదల కానున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/ వెబ్ సిరీస్ లు:
డిస్నీ+హాట్ స్టార్:
అవతార్:ది వే ఆఫ్ వాటర్-జూన్ 2
స్కూల్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) – జూన్ 2
నెట్ ఫ్లిక్స్:
ఎ బ్యూటిఫుల్ లైఫ్ (వెబ్ సిరీస్) – జూన్ 1
న్యూ ఆమ్స్టర్ డామ్ (వెబ్ సిరీస్) – జూన్ 1
ఇన్ఫినిటీ స్ట్రామ్ (మూవీ) – జూన్ 1
‘మ్యానిఫెస్ట్’ సీజన్-4 (పార్ట్ 2, వెబ్ సిరీస్) – జూన్ 2
స్కూప్ (వెబ్ సిరీస్) – జూన్ 2
జీ-5:
విశ్వక్ (తెలుగు) – జూన్ 2
ఘర్ బందూక్ బిర్యానీ (మరాఠీ) – జూన్ 2
హత్యాపురి (బెంగాలీ) – జూన్ 2
జియో సినిమా:
అసుర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూన్ 1
ముంబైకర్ (హిందీ సినిమా) – జూన్ 2
గోదావరి (మరాఠీ మూవీ) – జూన్ 3
ఖిలాడీ (భోజ్ పురి సినిమా) – జూన్ 4