‘ది అర్కైవ్స్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నాయికగా తన వేగాన్ని పెంచుతున్నది. తాజాగా ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో ఆమె నాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫాంటమ్ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
‘లవ్ టుడే’ రీమేక్ తమకు మంచి అవకాశంగా జునైద్, ఖుషి భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతున్నది. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమా గతేడాది తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తెలుగులోనూ హిట్ అయ్యింది. నేటి యువత ప్రేమ ప్రయాణాలకు అద్దం పట్టింది.