This Week Theater/Ott Releases | రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో బేబి హవానే నడుస్తుంది. ఓ వైపు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న.. మరో వైపు బేబి కలెక్షన్ల వడగండ్లు పడుతున్నాయి. ఇప్పటికే డెబ్బై కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్లో మరో పది కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసే చాన్స్‌లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక దాదాపు నాలుగైదు వారాల తర్వాత మళ్లీ బ్రో వంటి పెద్ద సినిమా థియేటర్లను పలకరించబోతుంది. మామ-అల్లుళ్లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఇక బ్రోతో పాటు ఈ వారం సినీ లవర్స్‌ను అలరించడానికి ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు సిద్ధం అవుతున్నాయి. ఈ వారం థియేటర్/ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లేంటో ఓ లుక్కేద్ధాం.
బ్రో:
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. రీసెంట్గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది.
స్లమ్‌డాగ్ హస్బండ్:
నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన ఈ సినిమా జూలై 29న రిలీజ్ కానుంది. ప్రణవీ మనుకొండ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏ ఆర్ శ్రీధర్ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు గట్రా సినిమాపై ఆసక్తిని నెలకొల్పాయి. పైగా ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున జరపడంతో జనాల్లో మంచి హైపే ఉంది.
ఒక్క రోజు..48 గంటలు:
ఆదిత్య, రేఖ నిరోషా జంటగా నటించిన ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ బండి దర్శకత్వం వహించాడు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు
ఆహా:
సామజవరగమన-జూలై 28
సోనీలివ్:
ట్విస్టెడ్ మెటల్ (వెబ్ సిరీస్)-జూలై 28
అమెజాన్ ప్రైమ్:
స్పై – జూలై 27
రెజీనా (తమిళ్ మూవీ) – జూలై 27
నెట్‌ఫ్లిక్స్:
నాయకుడు- జూలై 27
ఏ పెర్ఫెక్ట్ స్టోరీ – స్పానిష్ వెబ్ సిరీస్-జూలై 28
కెప్టెన్ ఫాల్ – ఇంగ్లీష్ సిరీస్-జూలై 28
D.P. సీజన్ 2 – కొరియన్ సిరీస్-జూలై 28
డిస్నీ+హాట్‌స్టార్:
ఆషిఖానా (హిందీ సిరీస్-4)-జూలై 28
ఈటీవీ విన్:
పోలీస్ స్టోరీ: కేస్ 1-జూలై 28
సోనీలివ్:
ట్విస్టెడ్ మెటల్ (వెబ్ సిరీస్)
బుక్ మై షో:
జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (హాలీవుడ్)-జూలై 28
ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్)-జూలై 28
ద ఫ్లాష్ (హాలీవుడ్)-జూలై 28
జియో సినిమా:
కాల్‌కూట్ (హిందీ)-జూలై 28
వన్ ఫ్రైడే నైట్ (హిందీ)-జూలై 28
అప్పత (తమిళ్)-జూలై 28