Devara | చుట్టమల్లె చుట్టేస్తావే తుంటరి చూపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమాలోని తొలిపాట ‘ఫియర్ సాంగ్' మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం రెండోపాట విడుదలైంది.
Devara | ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమాలోని తొలిపాట ‘ఫియర్ సాంగ్’ మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం రెండోపాట విడుదలైంది. ‘చుట్టమల్లె చుట్టేస్తావే తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపూ..’ అంటూ హీరోయిన్ పాయింట్ ఆఫ్‌వ్యూలో సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, అనిరుధ్ స్వరపరిచారు.
శిల్పారావు ఆలపించారు. కథానాయకుడిపై తనకున్న ప్రేమను కథానాయిక ఆవిష్కరించేలా సాహిత్యం, చిత్రీకరణ సాగింది. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై మోస్ట్ రొమాంటిక్‌గా దర్శకుడు కొరటాల శివ ఈ పాటను తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. రత్నవేలు ఛాయాగ్రహణం విజువల్ వండర్‌గా సాగింది.
ఈ పాటలో ఎన్టీఆర్ ైస్టెలిష్‌గా కనిపిస్తుంటే, జాన్వీ గ్లామర్ అవతార్‌లో యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ‘దేవర 1’ విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మాతలు. సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajiv Hanumanthu | శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం.. ఐఏఎస్ రాజీవ్ హనుమంతు, కుటుంబసభ్యులకు గాయాలు!
Mahesh Kumar Goud | మహేశ్ ‘బిస్కెట్’కు రాహుల్ చాక్లెట్.. భారత్ సమ్మిట్‌లో ఆసక్తికర సన్నివేశం!
KTR | తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిది.. కేటీఆర్ మండిపాటు
Section 22A | వీడని 22ఏ చిక్కుముడి.. సీఎం హామీ ఇచ్చి రెండు నెలలైనా కదలని సర్కార్.. రైతులు, భూ యజమానుల అవస్థలు
Meenakshi Natarajan | మీనాక్షి ఔట్.. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

