కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) అప్‌కమింగ్ మూవీ మారన్ (Maaran). ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ+హాట్ స్టార్ లో మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. రాజకీయ వేత్త పఝాని గురించి ఓ సెన్సేషనల్ స్టోరీ రాస్తాడు. ఈ పాత్రలో సముద్రఖని (Samuthirakani) నటించాడు. జర్నలిస్ట్‌కు, పొలిటీషియన్ మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగిందనే విషయాన్ని టచ్ చేస్తూ సాగుతుంది ట్రైలర్.
D16 ఫేం కార్తీక్ నరేన్ ( Karthick Naren) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్లో ధనుష్ అదిరిపోయే యాక్టింగ్ చేసినట్టు అర్థమవుతుంది. మాళవిక మోహనన్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది..మారన్ వృత్తిపరమైన పనులకు సపోర్టుగా నిలిచే వ్యక్తి పాత్రలో కనిపించనుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండబోతుందని ట్రైలర్ లో చెప్పేశాడు డైరెక్టర్ కార్తీక్ నరేన్.