Jordar Sujatha | భర్తకు షాకిచ్చిన జోర్దార్ సుజాత.. దెబ్బకు రాకింగ్ రాకేశ్ మొహం మాడిపోయిందిగా..!
Jordar Sujatha | జోర్దార్ సుజాత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె.. బిగ్‌బాస్ షోతో జనాలకు చేరువయ్యింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో తెగ పాపులర్ అయిపోయింది.
Jordar Sujatha | జోర్దార్ సుజాత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె.. బిగ్‌బాస్ షోతో జనాలకు చేరువయ్యింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో తెగ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేశ్‌తో ప్రేమలో పడిన సుజాత.. అతన్నే పెళ్లాడి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన భర్తకు సర్ప్రైజ్ ఇస్తున్నానని చెబుతూనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను జోర్దార్ సుజాత యూట్యూబ్‌లో షేర్ చేసింది.
ఫిబ్రవరి నెల అంటే అందరికీ వాలంటైన్స్ డే మాత్రమే స్పెషల్ కానీ.. తనకు మాత్రం రెండు స్పెషల్స్ ఉన్నాయని ఆ వీడియోలో జోర్దార్ సుజాత చెప్పింది. వాలంటైన్స్ డేతో పాటు తన మ్యారేజ్ డే కూడా ఫిబ్రవరిలోనే ఉన్నాయని తెలిపింది. తనకు ఈ నెలతో మంచి అనుబంధంతో పాటు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పింది. అందుకే ఇంత స్పెషల్ డేస్‌లో తన హజ్బెండ్కు గిఫ్ట్ ఇవ్వబోతున్నానని తెలిపింది. తన కోసం ఒక ఇల్లు కొన్నానని.. ఈ విషయం ఆయనకు కూడా తెలియదని ఆ వీడియోలో పేర్కొంది. ఈ 3BHK ప్లాట్ పూర్తి కావడానికి ఇంకో ఆరు నెలలు పడుతోందని.. కానీ ఈ మంత్లోనే రివీల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెడుతున్నానని చెప్పింది. ఈ ఇల్లు నేనే కొన్నా.. మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించా అని చెబుతూ.. రాకింగ్ రాకేశ్‌కు జోర్దార్ సుజాత సర్ప్రైజ్ ఇచ్చింది.
జోర్దార్ సుజాత చెప్పిన మాటలకు ఒక్కసారిగా రాకింగ్ రాకేశ్ షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ఒక అమ్మాయిగా ఎంతో సాధించి ఇంతగా ఎదిగావు.. దయచేసి ఇలా నాకు ఇచ్చినట్టుగా మా అమ్మకు షాకివ్వకు అంటూ జోర్దార్ సుజాతను తెగ పొగిడేశాడు. అప్పుడు రాకింగ్ రాకేశ్‌ను సుజాత కాసేపు ఆటపట్టించింది. ఆ తర్వాత ఆ ఇంటిని తాను కొనలేదని.. పక్కింటి వాళ్లు కొన్నారని అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఇదంతా ప్రాంక్ అని తెలిపింది. జోర్దార్ సుజాత దెబ్బకు రాకేశ్ నోట మాట రాలేదు. కొద్దిసేపు గ్యాప్ తీసుకుని ఇలాంటి ప్రాంకులు చేయవద్దని వారించాడు. సతీ సావిత్రి రేంజ్లో నటించావు.. నీకు మంచి ఫ్యూచర్ ఉందంటూ డైలాగులు చెప్పుకొచ్చాడు. రాకేశ్ ఫీలవ్వడం చూసిన సుజాత కాస్త బుజ్జగించింది. ‘ ఫీలవ్వకండి ఫ్యూచర్లో ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికే ఇలా చేశా అని.. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే’ అని జోర్దార్ సుజాత నచ్చజెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

