అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దు!

కథానాయికలు ఫిట్నెస్ విషయంలో అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దని, శరీరాకృతిలో హెచ్చుతగ్గులు కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపవని చెప్పింది షాలినిపాండే. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ భామ. అయితే ఆ తర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో కెరీర్లో కాస్త వెనకబడింది. ప్రస్తుతం బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ‘జయేష్‌భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె చాలా బరువు తగ్గిందట. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘పాత్ర డిమాండ్‌ను బట్టి శరీరాకృతిని మలచుకోవడంలో తప్పులేదు. అయితే అదే పనిగా ఫిట్నెస్ లక్ష్యాల్ని పెట్టుకోవడం మంచిది కాదు. కేవలం నా పాత్ర కోసమే నేను కొన్ని కిలోల బరువు తగ్గాను. షూటింగ్ పూర్తయ్యాక మరలా ఆ విషయం గురించి ఆలోచించలేదు. తరచుగా శరీరాన్ని మార్పులకు లోనుచేయడం మంచిది కాదు. దాని వల్ల హార్మోన్స్ సమతుల్యం దెబ్బతింటుంది. అది ఇతర సీరియస్ సమస్యలకు దారితీస్తుంది’ అని చెప్పింది షాలినిపాండే. అయితే తనకు స్కూల్రోజుల నుంచే బ్యాడ్మింటన్, వాలీబాల్‌లో ప్రవేశం ఉండటం వల్ల ఎప్పుడూ ఫిట్‌గానే కనిపిస్తానని పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

