Animal Movie | ‘యానిమల్’ లాంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరం : జావేద్ అక్తర్
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ ఏడాది విడుదలైన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో యానిమల్ కూడా చోటు సంపాదించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ లిరిక్ రైటర్, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రీసెంట్గా ఔరంగాబాద్‌లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న జావేద్ అక్తర్ ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్న యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని తెలిపాడు. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, అలాగే మరోక సీన్లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటివి ఉంటాయి. అయితే ఇలాంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిందని ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

