Jarann | మరాఠీ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు పొంది, ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘జరణ్’ (Jaraṇ). థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ చిత్రం మారాఠీతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
చక్కటి వినోదానికి, స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్లకు కేరాఫ్‌గా నిలుస్తున్న తెలుగు జీ5 (ZEE5) మరో సంచలన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కిష్కిందర్’ వంటి విజయవంతమైన హారర్ థ్రిల్లర్‌ను అందించిన ZEE5, ఇప్పుడు అత్యంత గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘జరణ్’ను తెలుగులో అందిస్తోంది. నవంబర్ 7 నుంచే ‘జరణ్’ చిత్రం జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి ఇది నిజంగా పండగే అని చెప్పాలి.
మరాఠీ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు పొంది, ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘జరణ్’ (Jaraṇ). హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు హృషికేష్ గుప్త దర్శకత్వం వహించగా.. అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ నిర్మించారు. అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిశోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అవనీ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ
‘జరణ్’ కథ రాధ (అమృత శుభాష్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తమ పూర్వీకుల ఇంటికి వెళుతుంది. అక్కడ ఓ పాత బొమ్మ దొరికిన తర్వాత ఆమెకు ఎదురైన వింత అనుభవాలను, భయానక సంఘటనలను గుర్తుచేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆమె ప్రవర్తనలో కనిపించే వింత మార్పులు, ఆమెలో నిగూఢంగా దాగిన భయాలు ఒక్కొక్కటిగా బయటపడడం, వాస్తవానికి, భ్రమకు (Illusion) మధ్య గీత చెరిగిపోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ట్రామా, జ్ఞాపకాలు, అతీంద్రియ శక్తులు (Supernatural) మేళవించిన ఈ కథనం ప్రతి క్షణం థ్రిల్‌ను పంచుతుంది.
ఈ చిత్రంలో అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్లు, భావోద్వేగాలతో కూడిన కథ, కథనం ‘జరణ్’ను మరో స్థాయికి తీసుకెళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు. మానసిక ప్రవృత్తిలోని భయాందోళనలు, అంతర్లీన భావోద్వేగాల గురించి ఈ చిత్రం లోతుగా చర్చించింది. తెలుగు జీ5లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ‘జరణ్’ను థ్రిల్లర్ ప్రేమికులు తప్పక చూడవలసిన కంటెంట్ అని చెప్పొచ్చు.