Jani Master | జైలు నుంచి విడుదలైన తర్వాత ఫ్యామిలీతో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన జానీ మాస్టర్
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు కావడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు కావడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. గత 36 రోజులుగా జైలు జీవితం గడిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. అయితే తన ఫ్యామిలీకి దూరంగా ఉండి 37 రోజులు తర్వాత కలుసుకున్నట్లు ఒక వీడియోను పంచుకున్నాడు.
నా కుటుంబం & శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఈరోజు ఇక్కడకు చేర్చాయి. నిజం అనేది ఏదో ఓ రోజు తప్పక బయటపడుతుంది. నా ఫ్యామిలీ పడిన కష్టం.. ఎప్పటికీ నన్ను వేదనకు గురిచేస్తూనే ఉంటుంది అంటూ జానీ మాస్టర్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. 2017లో టీవీ షోలో పాల్గోన్న ఒక మహిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే జానీ తన టీంలో తీసుకున్నాడని.. నేను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఒక హోటల్లో జానీ తనపై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. రీసెంట్గా జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 06 నుంచి 09 వరకు బెయిల్ కావాలని కోర్టును కోరగా.. బెయిల్ మంజూరు చేసింది. అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల కమిటీ. అనంతరం బెయిల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూలర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది.
A lot is taken away from us in these 37 days 🥹
My family & well wishers’ prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever 🙏🏻 pic.twitter.com/kJFgi4zad2— Jani Master (@AlwaysJani) October 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

