ఆ ప్రయత్నంలోనే ఉన్నా!
ఈ సొగసరి ‘మిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె అభినయం బాగుందనే ప్రశంసలొస్తున్నాయి.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి అవకాశాల్ని పొందడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని, అయితే ప్రతిభావంతురాలైన నటిగా నిరూపించుకోవడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ఇటీవలే ఈ సొగసరి ‘మిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె అభినయం బాగుందనే ప్రశంసలొస్తున్నాయి.
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది జాన్వీకపూర్. జీవితంలోని ప్రతి అడుగులో అంతా శుభమే జరగాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందని చెప్పింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాల్ని గెల్చుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మున్ముందు నన్ను కొత్త పాత్రల్లో చూస్తారు.
సినిమాను నేను ఎంతగానో ప్రేమిస్తా. సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించాలనే తపనతో పనిచేస్తున్నా. భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉంటాననే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గుంజన్ సక్సేనా, గుడ్‌లక్ జెర్రీ చిత్రాల్లో చక్కటి అభినయంతో పేరు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

