అదే విజయ మంత్రం
‘వర్కవుట్స్ విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా జిమ్‌కు వెళ్తాను. శరీరం, మనసు మధ్య సమన్వయం కుదిరితే సానుకూల ఆలోచనలతో ముందుకుసాగుతాం. అప్పుడే కెరీర్లో మంచి ఫలితాలొస్తాయి’
‘వర్కవుట్స్ విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా జిమ్‌కు వెళ్తాను. శరీరం, మనసు మధ్య సమన్వయం కుదిరితే సానుకూల ఆలోచనలతో ముందుకుసాగుతాం. అప్పుడే కెరీర్లో మంచి ఫలితాలొస్తాయి’ అని చెప్పింది బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్. హిందీ చిత్రసీమలో ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే నాయికల్లో ఆమె ఒకరు. జాన్వీకపూర్ సోషల్‌మీడియా ఖాతాల్లో ఎక్కువగా ఫిట్నెస్ వీడియోలే కనిపిస్తాయి.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘నా దృష్టిలో వర్కవుట్స్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు. వివిధ మార్గాల్లో ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. వెయిట్‌లిఫ్టింగ్, కార్డియోతో పాటు స్మిమ్మింగ్, యోగా కూడా చేస్తాను. జిమ్ వర్కవుట్స్‌తో పాటు యోగా చేయడం చాలా మేలు చేస్తుంది. తొలుత జాగింగ్, వాకింగ్‌తో ప్రారంభించి క్రమంగా సీరియస్ వర్కవుట్స్ వైపుకు వెళితే మంచిది. కెరీర్‌పరమైన ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఆనందంగా ముందుకు సాగడానికి ఫిట్నెస్ ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్. ఇటీవలే ఈ భామ ‘మిలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Gim
- janhvi kapoor
- workouts
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

