Janhvi Kapoor | జాన్వీ కపూర్ డేటింగ్ రూమర్స్: ఆన్ లైన్ చాటింగ్ వైరల్
Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమై.. మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). జాన్వీ కపూర్, శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో డేటింగ్ లో వున్నట్లు చాలా రోజులుగా కథనాలు వినిపిస్తున్నాయి.
Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమై.. మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అయితే తాజాగా మరోసారి జాన్వీకపూర్ డేటింగ్ పై వస్తున్న వార్తలు బీ టౌన్ లో హాట్ టాపిక్‌గా మారాయి. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో డేటింగ్ లో వున్నట్లు చాలా రోజులు గా కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ జంట తరచూ పార్టీలు, ఫంక్షన్స్ లో దర్శనమిస్తున్న ఫోటోలు ఇదివరకే వైరల్ అయ్యాయి. తాజాగా వీరి ఇన్స్టాగ్రామ్ చాట్ డేటింగ్ రూమర్స్‌కు మళ్ళీ బలాన్ని ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకతను.. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో శిఖర్ పింక్ డ్రెస్ వేసుకున్న ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన జాన్వీ.. ‘ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరు’ అని కామెంట్ చేసింది. దీనికి బదులుగా ‘నేను నీ వాడినే’ (I’m all yours) అని అర్ధం వచ్చేలా బదులు ఇచ్చాడు శిఖర్. అయితే వెంటనే ఆ కామెంట్స్ డిలీట్ కూడా చేశారు.
కానీ ఇంతలోనే ఈ చాట్ వైరల్ అయ్యింది. వీరి మధ్య వున్న బాండింగ్ ని మరింతగా బలపరిచింది. కాగా జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. ఎన్టీఆర్ ‘దేవర’తో తెలుగులోకి పరిచయం అవుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

