సినిమాలపరంగా పెద్ద విజయాలు లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్. సోషల్‌మీడియాలో హాట్‌హాట్ ఫొటోషూట్లతో దర్శనమిస్తూ యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ భామ. ప్రస్తుతం ఈ సొగసరి యువ వ్యాపారవేత్త షికర్ పహారియాతో ప్రేమాయణాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. తన లవ్‌ఎఫైర్ గురించి కాఫీ విత్ కరణ్ షోలో సూచనప్రాయంగా వెల్లడించింది జాన్వీకపూర్.
తాజాగా ఈ ప్రేమ జంట బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ హోస్ట్ చేసిన డిన్నర్ పార్టీలో తళుక్కున మెరిశారు. కారులో కలిసి వెళ్తున్న వారిద్దరిని ఫొటోలు తీయడానికి అక్కడున్న వారు ప్రయత్నించగా జాన్వీకపూర్ ముఖం దాచుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ‘మిలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జాన్వీకపూర్. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.