Janaka Aithe Ganaka | కండోమ్ కంపెనీపై సుహాస్ కేసు.. ఇంట్రెస్టింగ్గా ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్
Janaka Aithe Ganaka | టాలీవుడ్ కుర్ర హీరో సుహాస్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Janaka Aithe Ganaka | టాలీవుడ్ కుర్ర హీరో సుహాస్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’(Janaka Aithe Ganaka). ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తుండగా.. బలగం, లవ్మీ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. ఎల్కేజీ, యూకేజీలకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్ క్లాస్ యువకుడు(సుహాస్) తనకు పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ కాలంలో పిల్లలను పెంచడం కష్టమని పిల్లలు వద్దనుకుంటున్నా సుహాస్‌కు సడన్‌గా తన భర్య గర్భవతి అంటూ షాక్ ఇస్తుంది. అయితే తాను వాడిన కండోమ్ వలనే ఇలా అయ్యిందంటూ నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. అయితే ఈ కేసు సుహాస్ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది. చివరకు తాను కండోమ్ కంపెనీపై పెట్టిన కేసు గెలిచాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో సుహాస్‌తో పాటు, సంగీత్, వేన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

