Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణం, నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఓవర్సీస్ ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ ప్రకారం సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో సాగినట్లు తెలుస్తోంది.
‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించారు. మొదటి భాగం ముగిసిన తర్వాత కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు ప్రేక్షకుల స్పందనలను బట్టి తెలుస్తోంది. కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలనుకునే రిటైర్డ్ పోలీస్ అధికారి ముత్తువేల్ పాండియన్‌కు మళ్లీ కొన్ని పరిస్థితుల కారణంగా రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, తెరపై ఆయన కనిపించే తీరు అభిమానులను ఆకట్టుకున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన పరిచయ సన్నివేశం, టైటిల్ కార్డ్‌కు థియేటర్లలో మంచి స్పందన లభించిందని పోస్టులు చేస్తున్నారు.
ఓవర్సీస్ ప్రీమియర్ల నుంచి వస్తున్న తొలి స్పందన ప్రకారం ‘జైలర్ 2’ ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా సాగినట్లు తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ తనదైన డార్క్ కామెడీని రజనీకాంత్ మాస్ ఎలివేషన్లతో కలిపి కథను నడిపించినట్లు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. యోగిబాబు, మూర్తి కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా నవ్వులు పూయించాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని సోషల్ మీడియాలో స్పందనలు కనిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం ఈ సన్నివేశానికి మరింత బలాన్ని ఇచ్చిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభంలో కథను ముందుకు తీసుకపోవడానికి కొంత సమయం తీసుకోవడం వల్ల కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
వయసు మీదపడినా తెరపై రజనీకాంత్ చూపించిన స్టైల్, కళ్లజోడు ధరించే తీరు, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎలివేషన్ సన్నివేశాలకు అనిరుధ్ నేపథ్య సంగీతం అదనపు బలాన్ని ఇచ్చిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశంలో సంగీతం హైలైట్‌గా నిలిచిందని చెబుతున్నారు. నెల్సన్ డార్క్ కామెడీ, మాస్ సన్నివేశాలను కలిపి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అలానే ప్రముఖ నటుల ప్రత్యేక పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రజనీకాంత్ అభిమానులకు నచ్చేలా కొన్ని ఎలివేషన్ సన్నివేశాలను రూపొందించినట్లు తెలుస్తోంది.
సినిమాకి సంబంధించి ఇస్తున్న రివ్యూలలో కొన్ని లోపాలను కూడా ప్రేక్షకులు ప్రస్తావిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన కమర్షియల్ ఫార్ములానే కొనసాగించడం వల్ల కథలోని కొన్ని మలుపులను ముందుగానే ఊహించగలిగే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. కథ ప్రారంభంలో నెమ్మదిగా సాగిన సన్నివేశాలు, కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో నవ్వించని కామెడీ కూడా మైనస్లుగా పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ ప్రీమియర్లు చూసిన కొందరు ప్రేక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. పూర్తి స్థాయి సమీక్షలు, మరిన్ని ప్రేక్షకుల స్పందనలు వచ్చిన తర్వాత సినిమాపై స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. మొత్తంగా ‘జైలర్ 2’ రజనీకాంత్ అభిమానులకు మాస్ ఎలివేషన్లు, స్టైల్, నేపథ్య సంగీతంతో కూడిన కమర్షియల్ వినోదాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

