Jab Talak First Look | కాక్టెయిల్ 2 నుంచి ‘జబ్ తలక్’ సాంగ్.. షాహిద్, కృతిలతో రష్మిక మందన్న సందడి!
Cocktail 2 | బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'కాక్టెయిల్ 2' నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి పాట 'జబ్ తలక్' ఫస్ట్ లుక్, టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
Cocktail 2 | బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కాక్టెయిల్ 2’ నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘జబ్ తలక్’ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. షాహిద్ కపూర్, కృతి సనన్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటను అరిజిత్ సింగ్ మరియు అకాసా అద్భుతంగా ఆలపించగా, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు.
ఈ పాట సమ్మర్ వెకేషన్, రోడ్ ట్రిప్ మరియు పార్టీ మూడ్‌ను తలపిస్తూ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘తుమ్ హీ హో బంధు’ వైబ్‌ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హోమీ అదాజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ తన మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో షాహిద్-కృతి జంట ‘తేరీ బాతోం మే ఐసా ఉల్జా దియా’తో ఆకట్టుకోగా, ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక కూడా తోడవడంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై అందరి దృష్టి నెలకొంది. ఈ చిత్రం జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

