Leo Badass | లియో టీమ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ‘బాడాస్’ తెలుగు వెర్షన్ వచ్చేసింది.
Leo Second Single | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది.
Leo Second Single | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ట్రైలర్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి అభిమానులను నిరాశపరిచింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మూవీ నుంచి వరుసగా అప్డేట్లను ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్(Leo Second Single) బాడాస్ (Badass)ను తమిళంలో విడుదల చేయగా.. విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ”సింగం సరసరా వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. చెడు చెరపగా తన గురి పెడితే మదం వదిలిన మందలు పరుగే. తను అసలొక చల్లని పవనం బాడాస్”. అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ ట్రీట్‌లా సాగింది. మరోవైపు లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
It’s time to sing & celebrate #Badass in Telugu 🔥🎶
Here’s the lyrical song –https://t.co/GvnVZZGica#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss @SitharaEnts @SonyMusicSouth… pic.twitter.com/lbvWmYiCut
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 7, 2023
లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

