ఛాంగురే ఐటెం సాంగురే..

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఛాంగురే ఐటెం సాంగురే..’ అనే గీతాన్ని ఈ నెల 22న కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ విడుదల చేయబోతున్నది. ఈ గీతానికి సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ‘వారసత్వంగా రౌడీయిజాన్ని స్వీకరించిన ఓ వ్యక్తి కథ ఇది. యాక్షన్, వినోదం ప్రధానంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్కు మంచి స్పందన లభిస్తోంది. ‘ఛాంగురే ఐటెం సాంగురే’ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్నందించగా మంగ్లీ, సాయికార్తిక్, దత్తుఆలపించారు. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు’ అని దర్శకుడు తెలిపారు. బాబీసింహ, నేహాశెట్టి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భాను, సంగీతం: చౌరస్తారామ్, సాయికార్తీక్, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

