IT Raids | సినీ ప్రముఖుల ఇండ్లలో ముగిసిన ఐటీ సోదాలు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇండ్లలో ఐటీ సోదాలకు (IT Raids) ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. హైదరాబాద్‌లోని 16 చోట్ల మూడు రోజులపాటు జరిగిన తనిఖీలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇండ్లలో ఐటీ సోదాలకు (IT Raids) ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. హైదరాబాద్‌లోని 16 చోట్ల మూడు రోజులపాటు జరిగిన తనిఖీలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు దిల్ రాజు, అతని సోదరుడు, కుమార్తెతోపాటు వ్యాపారుల భాగస్వాముల ఇండ్లు కార్యాలయాలు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, మ్యాంగో మీడియా, పుష్ప దర్శకుడు సుకుమార్ నివాసాల్లో సోదాలు చేశారు.
అదేవిధంగా ప్రముఖ ఫైనాస్సర్లు సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇండ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతోపాటు పుష్ప 2 సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై ఆరాలు తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.
ఏదీ అడగను.. ఇచ్చిందే తీసుకుంటా!
‘సంక్రాంతికి వస్తున్నాం’ అపూర్వ విజయంపై చిత్ర కథానాయకుడు వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. అందరూ సినిమాను ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అంటున్నారని చెప్పారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 200కోట్ల వసూళ్లను దాటి బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటేష్, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు.
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ఈ సినిమా చేస్తున్నప్పుడే పాజిటివ్‌గా అనిపించిందని, షూటింగ్ మొత్తం ఓ మ్యాజికల్ జర్నీలా సాగిందని వెంకటేష్ చెప్పారు. ‘ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసుంటే ఇంకా భారీ విజయం దక్కేది కదా?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘నేను జీవితంలో ఎప్పుడూ ఏదీ అడగను. నా దగ్గరకు వచ్చిందే తీసుకుంటా.
నిజానికి ఈ విజయమే నాకు పెద్ద బోనస్’ అని బదులిచ్చారు. పదో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తున్నదని, కుటుంబ కథా చిత్రాలకున్న బలాన్ని మరోమారు ఈ సినిమా చాటిచెప్పిందని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తాను ప్రతి గడపకు చేరుకున్నానని, అమ్మలాంటి అందమైన జ్ఞాపకమిదని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఆనందం వ్యక్తం చేశారు.
నేను వైట్ వైట్: ఈ సమావేశంలో సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ రైడ్స్ గురించి స్పందించమని వెంకటేష్‌ను కోరగా ‘ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా? నిజమా? ఆ విషయం నాకు తెలియదు. మిగతా వాళ్ల విషయాన్ని పక్కనపెడితే.. నేను పారితోషికం మొత్తం వైట్‌లోనే తీసుకుంటా. నేను వైట్ వైట్. నా రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా’ అని వెంకటేష్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

