సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయడం ప్రభాస్‌కు అలవాటు. కానీ ఈసారి పద్ధతి మార్చి…విరామం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తను ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు కొత్త చిత్రాల షూటింగ్‌లనూ ప్రారంభిస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి భారీ చిత్రాల రెగ్యులర్ షూటింగ్స్ చేస్తున్నారు. ‘ఆది పురుష్’ సినిమా వర్క్ కూడా కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ ఉండగానే…తాజాగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్లో అడుగుపెట్టారు.
హైదరాబాద్‌లో ఓ భారీ హౌస్ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ మూవీ ఇది కాగా..ఆద్యంతం హిలేరియస్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజా షెడ్యూల్ కోసం ప్రభాస్ వారం పాటు డేట్స్ ఇచ్చారట. మాళవిక మోహనన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రబృందం అధికారికంగా వెల్లడించనున్నారు.