Ravi Teja | రవితేజ లైనప్‌లో మరో కొత్త దర్శకుడు.. ఈ సారి తేడా కొట్టదుగా..!
Ravi Teja Next Project | కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేయడంలో రవితేజ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే రవన్న ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. వాళ్లు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే రేంజ్‌కు వెళ్లారు.
Ravi Teja Next Project | కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేయడంలో రవితేజ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే రవన్న ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. వాళ్లు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే రేంజ్‌కు వెళ్లారు. ఇప్పుడున్న బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, బాబీ, గోపిచంద్ మలినేనిలకు మొదటి అవకాశం ఇచ్చింది రవితేజనే. కాగా గతకొన్నేళ్ల నుంచి రవితేజ కొత్త దర్శకులతో సినిమాలు చేయట్లేదు. ముఖ్యంగా టచ్ చేసి చూడు వంటి డిజాస్టర్ తర్వాత కొత్త దర్శకులను పక్కన పెట్టేశాడు. కాగా మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.
రవితేజ సితార బ్యానర్లో ఓ సినిమాకు కమిట్అయ్యాడు. ప్రస్తుతం రవన్న ఉన్న లైనప్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ సితారా తాజాగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఆయన్ను రవితేజ దగ్గరకు పంపారట. ఇక ఆయన చెప్పిన లైన్ రవన్నకు కూడా బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేయమని చెప్పాడని ఇన్సైడ్ టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుతం రవితేజ లైనప్ మాములుగా లేదు. ఓ వైపు ఈగల్ షూటింగ్లో బిజీగా ఉంటూనే మరో వైపు టైగర్ నాగేశ్వరరావు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నాడు. ఇక గోపిచంద్ మలినేనితో సినిమాను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. మరోవైపు మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో హిందీ రైడ్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే గతేడాది ధమాకాతో తనకు వంద కోట్ల బొమ్మిచ్చిన త్రినాథరావు నక్కినతోనూ మాస్ రాజా ఓ సినిమా చేయనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

