Sir Movie | ధనుష్ సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా స్టార్ హీరో?
ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపి 'సార్' సినిమా చేశాడు. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.
Sir Movie Pre-Release Event | తమిళ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రఘువరన్ B-Tech’, మారి, తిరు వంటి సినిమాలు ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపి ‘సార్’ సినిమా చేశాడు. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమాపై ఎక్కడలేని బజ్ తెచ్చిపెట్టాయి.
ఇక ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమా క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు చిత్రబృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తుందట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి త్రివిక్రమ్ తన స్వంత బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్‌పై నిర్మించాడు. దాంతో పవన్ ఈవెంట్‌కు వస్తే సినిమాపై క్రేజ్ అమాంతం పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మాములుగా పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రావడానికి ఎక్కువగా ఇష్టపడడు. కానీ త్రివిక్రమ్ పిలిస్తే మాత్రం వచ్చే అవకాశం లేకపోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

