న్యూఢిల్లీ: హాలీవుడ్ స్టార్, టైటానిక్ ఫేమ్ హీరో లియోనార్డో డికాప్రియో(Leonardo DiCaprio).. భారతీయ సంతతికి చెందిన మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడు. 48 ఏళ్ల డికాప్రియో.. 28 ఏళ్ల నీలమ్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జోడీ ఇటీవల లండన్‌లోని చిల్ట్రెన్ ఫైర్హౌజ్లో దర్శనం ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న చర్చ జరుగుతోంది.
నీలమ్ గిల్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో బ్రిటీష్ పంజాబీ మోడల్ అని రాసుకున్నది. తాజాగా కేన్స్‌లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె రెడ్‌కార్పెట్‌పై మెరిసింది. ఇదే ఫెస్టివల్లో కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ చిత్రం స్క్రీనింగ్ కోసం లియోనార్డో కూడా హాజరయ్యాడు.
డికాప్రియో గతంలో కమిలా మూర్న్తో డేటింగ్ చేశాడు. 2020 అకాడమీ అవార్డుల సమయంలో ఇద్దరూ కనిపించినా.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. కమిలాతో బ్రేకప్ తర్వాత మరో అమ్మాయి గిగి హదిద్తోనూ లియోనార్డో డేటింగ్ చేశాడు.