Sir Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న సార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కంటెంట్ కొత్తగా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధంలేకుండా పరభాష సినిమాలను కూడా బ్లాక్బస్టర్లు చేసేస్తుంటారు. ఇటీవలే విడుదలైన సార్ మూవీ కూడా ఈ కోవలోకే చెందిందే.
Sir Movie On OTT | కంటెంట్ కొత్తగా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధంలేకుండా పరభాష సినిమాలను కూడా బ్లాక్బస్టర్లు చేసేస్తుంటారు. ఇటీవలే విడుదలైన సార్ మూవీ కూడా ఈ కోవలోకి చెందిందే. ధనుష్‌కు తెలుగులో పర్వాలేదనిపించే మార్కెటే ఉంది. కానీ మరీ ఆయన సినిమాలు భీభత్సమైన కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు. గతేడాది రిలీజైన తిరు తమిళంలో రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. తెలుగులో రూ.4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే సార్ మూవీ మాత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ధనుష్‌కు తెలుగులో ఊహించని విజయాన్ని తెలుగు ప్రేక్షకులు అందించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే సార్ మూవీ తమిళ కలెక్షన్లతో పోలిస్తే తెలుగు కలెక్షన్లే అధికంగా ఉన్నాయి.
రిలీజ్‌కు ముందు జరిపిన ప్రమోషన్లతో తెలుగులో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. పైగా తెలుగు నిర్మాణ సంస్థ కావడం, తెలుగు దర్శకుడు కావడంతో సార్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా మార్చి 22 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థతో సార్ మూవీ మేకర్స్ డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే చాన్స్ ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార సంస్థ నిర్మించింది. ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

