Ira Khan | బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఆమె ప్రియుడు నుపూర్ శిఖారేతో ముంబైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమిర్‌ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, ఐరా తల్లి రీనా దత్తా, ఆమిర్‌ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూతురే ఐరా. కాగా, తాజాగా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలును నుపూర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఐరా, నుపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం తాము డేటింగ్లో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ పొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.