తల్లి పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నా!
‘నా కెరీర్లో మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. చిన్నతనంలో నాతో అమ్మ ఎలా ఉండేదో అనే విషయాలను తెలుసుకొని నటించా. నటిగా పాత్రల విషయంలో వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. అందుకు తగినట్లుగా సినిమాలను ఎంచుకుంటున్నా’ అని చెప్పింది మీనాక్షి చౌదరి.
‘నా కెరీర్లో మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. చిన్నతనంలో నాతో అమ్మ ఎలా ఉండేదో అనే విషయాలను తెలుసుకొని నటించా. నటిగా పాత్రల విషయంలో వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. అందుకు తగినట్లుగా సినిమాలను ఎంచుకుంటున్నా’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను సుమతి అనే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తా. ప్రేమను పంచే భర్త, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం ఆమెది.
అయితే భర్త భాస్కర్‌కు డబ్బు పట్ల ఉండే విపరీతమైన వ్యామోహం వల్ల దంపతుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని చెప్పింది. ఈ సినిమాతో నటిగా తనకు మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశం లభిస్తుందని మీనాక్షి చౌదరి విశ్వాసం వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సిరీస్‌లు వచ్చినా.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా రాశాడని, ఇది సామాన్యుడి కథ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని తెలిపింది. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ ‘మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నా. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

