నా మనసుకు దగ్గరైన ప్రేమకథ ఇది
చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి అనుపమ పరమేశ్వరన్. కథానాయికగా తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుని హడావుడిగా సినిమాలు చేయడం తనకు ఇష్టం వుండదని అంటున్నదీ అందాలతార.
చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి అనుపమ పరమేశ్వరన్. కథానాయికగా తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుని హడావుడిగా సినిమాలు చేయడం తనకు ఇష్టం వుండదని అంటున్నదీ అందాలతార. ఇటీవల ‘కార్తికేయ-2’తో ఘనవిజయాన్ని అందుకున్న అనుపమ మరోసారి కథానాయకుడు నిఖిల్‌తో కలిసి నటించిన చిత్రం ‘18 పేజీస్’. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
కార్తికేయ-2 విజయం తరువాత వెంటనే నిఖిల్‌తో కలిసి నటిస్తున్న ‘18 పేజీస్’ ఎలా ఉండబోతుంది?
‘18 పేజీస్’ చిత్రం ‘కార్తికేయ-2’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా. ఇదొక క్రేజీ లవ్‌స్టోరీ. ఇదొక స్వచ్చమైన ప్రేమకథ. ఒక ఘనవిజయం తరువాత మా కలయికలో రాబోతున్న ఈ చిత్రం కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇప్పటి వరకు నేను చేసిన ప్రేమకథల్లో ఇది నా ఫేవరేట్ మూవీ. ఈ చిత్రంలో నందిని అనే పాత్రలో కనిపిస్తాను. చాలా వైవిధ్యంగా కనిపించే అమ్మాయి. ఫేస్బుక్ ట్విట్టర్, ఇన్‌స్టా, మొబైల్ అడిక్షన్ వంటి సోషల్‌మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో అసలు సోషల్‌మీడియాకు దూరంగా, కనీసం సెల్‌ఫోన్ లేకుండా ఉండే అమాయకమైన అమ్మాయి నందిని. ఈ పాత్ర నా మనసుకు చాలా దగ్గరనిపించింది. ఇలాంటి పాత్రను డిజైన్ చేసిన దర్శకుడు ప్రతాప్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.
సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు? ఇప్పుడు ఆయన కథలో నటించడం హ్యాపీగా ఉందా?
‘రంగస్థలం’ చిత్రం నాకు రాసిపెట్టి లేదు. మనం ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని అవకాశాలు మిస్ చేసుకుంటాం. కొన్ని మనకు తెలియకుండానే మనకోసం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ‘రంగస్థలం’ అవకాశం చేజారినప్పుడు బాధపడ్డాను. మళ్లీ ఇప్పుడు ఆయన కథలో నటించడం హ్యాపీగా ఉంది. ఆయన బ్రెయిన్ చైల్డ్ నుండి వచ్చిన పాత్రను దర్శకుడు ప్రతాప్ చక్కగా తీర్చిదిద్దారు.
మీ దర్శకత్వంలో సినిమా ఉంటుందా?
ప్రస్తుతం నటిగా నా సినిమాలు పూర్తయిన తరువాత తప్పకుండా చేస్తా. అంతకంటే ముందు దర్శకత్వంలో మెలకువలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

