త్రివిక్రమ్ మాటలు స్ఫూర్తిని కలిగించాయి

‘నల్లమల అటవీప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్‌ను జతచేసి రూపొందించిన చిత్రం మా ‘నల్లమల’. మట్టి పరిమళాలు, సహజత్వంతో నిండిన కథలు, పాత్రలతో సినిమాలు తెరకెక్కించడం నాకు చాలా ఇష్టం. అందుకే రియలిస్టిక్ కథలతోనే నా దర్శకత్వంలో సినిమాలు రూపొందిస్తాను’ అన్నారు దర్శకుడు రవిచరణ్. ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నల్లమల’. ప్రతి నాయకుడు అమిత్ తివారి ఈ చిత్రంలో కథానాయకుడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు రవిచరణ్ తెలియజేస్తూ‘నల్లమల నేపథ్యంలో జరిగిన కొన్ని చీకటి ఒప్పందాలపై అల్లుకున్న 1965లో జరిగే పీరియాడికల్ కథ ఇది. యథార్థ సంఘటనలకు కొంత ఫిక్షన్‌ను జతచేసి ఎంతో సహజంగా రూపొందించాను. 1980లో ఇరాన్ -ఇరాక్ యుద్దానికి కొన్ని రోజుల ముందు నల్లమలో ఏం జరిగింది అనేది విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాను. నల్లమల అటవీ బిడ్డగా స్వచ్ఛమైన అడవి లాంటి పాత్రలో అమిత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నాజర్, తనికెళ్లభరణి పాత్రలు కీలకంగా వుంటాయి. ప్రముఖ దర్శకుడు తివ్రిక్రమ్ గారు ‘నల్లమల’ మోషన్ పోస్టర్ చూసి.. చరణ్ ఇది మంచి కథ, తొందరపడకు.. నిదానంగా విడుదల చేసుకో.. తప్పకుండా ఈ చిత్రం హిట్ కొట్టేలా వుంది’ అంటూ చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఆయన అభినందనలు నాలో స్ఫూర్తిని కలిగించాయి. త్వరలో మరో చిత్రం ‘నగారా’ ఇదొక చెత్త చుట్టూ నడిచే కథ. వాస్తవాలకు, నేలకు దగ్గరగా, సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం నాకిష్టం’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

